మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీజేపీ కంటే నాలుగు ఓట్లు అధికంగా పోలయ్యాయి. ఉపఎన్నికలో మొత్తం 686 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ పార్టీకి 228 ఓట్లు రాగా, బీజేపీ 224, బీఎస్పీ 10, ఇతరులకు 88 పోలవగా, మిగిలినవి తిరస్కరణకు గురయ్యాయి.