ట్విట్టర్ కట్టుకథల పుట్టిల్లు, వాస్తవాలకు బురదచల్లుతుంది, అసత్యాలను ప్రచారం చేస్తుందని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ వ్యాఖ్యానించారు. చికాగోలో జరిగిన నిధుల సమీకరణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడారు. ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న అంశంపై బైడెన్ స్పందించారు. ప్రపంచంపైకి అసత్యాల బురద చల్లే వేదిక ఏదైనా ఉందంటే అది ట్విట్టరే అని తీవ్రంగా మండిపడ్డారు.ట్విట్టర్ పేరుకు సమాచార అంతర్జాలం అయితే దీనికి ఎడిటర్లు అంటూ ఎవరూ ఉండరు. అంతా బురద చల్లే బాధ్యతలు తీసుకున్న వారే అని ఘాటుగా చమత్కరించారు. ఇక మస్క్ దీనిని హస్తగతం చేసుకున్నారనే విషయంపై మాట్లాడేందుకు ఏమీ లేదని బదులిచ్చారు.












