రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు… డిసెంబర్ 8 న ఫలితం… ప్రకటించిన ఈసీ

గుజరాత్ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. 2 దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు. డిసెంబర్ 1 న తొలిదశ పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 5 న రెండో విడత పోలింగ్ వుంటుంది. డిసెంబర్ 8 న తుది ఫలితాలను వెల్లడిస్తామని రాజీవ్ కుమార్ ప్రకటించారు. హిమాచల్ ఎన్నికల ఫలితాల రోజే గుజరాత్ ఫలితాలు కూడా వెలువడనున్నాయి.

పూర్తి వివరాలు

మొదటి దశ ఎన్నికల : డిసెంబర్ 1

రెండో దశ ఎన్నిక : డిసెంబర్5
డిసెంబర్ 8 న ఓట్ల లెక్కింపు

మొత్తం నియోజకవర్గాలు :182
జనరల్ స్థానాలు :142
ఎస్సీ రిజర్వ: 13
ఎస్టీ రిజర్వ్ :27
మొత్తం పోలింగ్ స్టేషన్లు : 51,782
మొత్తం ఓటర్లు :4.90 కోట్లు
మగవారు : 2.53 కోట్లు
స్త్రీలు : 2.37 కోట్లు

గుజరాత్ లో18 ఫిబ్రవరి, 2023 తో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు దశల్లో జరగనున్న పోలింగ్ కు ఈ నెల 5న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 3,24,422 మంది కొత్త ఓటర్లు తొలిసారి ఓటు వేస్తారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని కేంద్ర ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. మొ త్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 51,782. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో కనీసం 50% వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు ఉంటాయని వివరించారు.

Related Posts

Latest News Updates