తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు స్టాలిన్ నివాసంలో ఈ సమావేశం సాగింది.అయితే… తమిళనాడులో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి తాను వచ్చానని, స్టాలిన్ తన సోదరుడు అని, అందుకే కలవడానికి వచ్చానని సీఎం మమత పేర్కొన్నారు. అంతే తప్ప… తమ మధ్య రాజకీయాలు అసలు చర్చకు రాలేదని ఆమె స్పష్టం చేశారు.ఇద్దరు రాజకీయ నేతలు కలిస్తే.. రాజకీయాలే కాదు…ఇతర విషయాలు కూడా మాట్లాడుకోవచ్చని అన్నారు. ఈ భేటీపై సీఎం స్టాలిన్ కూడా స్పందించారు. మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యామని తెలిపారు. రాజకీయాలు తమ మధ్య ప్రస్తావనకు రాలేదని స్టాలిన్ తెలిపారు.












