ప్రపంచ ఫొటో జర్నలిజం దినోత్సవం సందర్భంగా ఫొటో జర్నలిస్టులకు అవార్డులు

విజయవాడలో ఏపీ సృజనాత్మకత అండ్ సంస్కృతి సమితి సౌజన్యంలో ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫిక్ కౌన్సిల్, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటో జర్నలిజం దినోత్సవంజరిగింది. పలువురు ఫొటో జర్నలిస్టులకు కలెక్టర్ ఢిల్లీరావు సత్కరించారు. జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్న వారిలో రవీంద్రనాథ్, రావూరి కోటేశ్వరావుకు అందజేశారు. ఇక… సాక్షి అసిస్టెంట్ చీఫ్ ఫొటోగ్రాఫర్ రూబెన్ కు సి. రాఘవాచారి అవార్డు, సీఎం ఫొటోగ్రాఫర్ సతీష్ కు ఎంఏ రహీమ్ మెమోరియల్ అవార్డు, హిందూ చీఫ్ ఫొటోగ్రాఫర్ దీపక్ కు నీలంరాజు మురళీధర్ అవార్డును అందజేశారు. వీరితో పాటు ఈనాడు నుంచి సింహాచలానికి కృష్ణ అవార్డు, మరిడయ్యకు పోలవరపు కోటేశ్వర రావు అవార్డు, ఆంధ్రజ్యోతి నుంచి జోగారావుకు కామ్రేడ్ మోటూరు హనుమంత రావు అవార్డు, రాధాకి శ్రీనివాసులు అవార్డు అందజేశారు.

Related Posts

Latest News Updates