బెంగళూరు అంటేనే ఓ వైపు సంప్రదాయం, మరోవైపు టెక్నాలజీ గుర్తుకొస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రకృతి మరియు సంస్కృతి యొక్క ఏకైక సంగమం ఉన్న ప్రదేశమని కొనియాడారు. కర్నాటక రాష్ట్ర గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2022 ఈ రోజు బెంగళూరులో ప్రారంభమైంది. ఈ సమ్మిట్ కు భారత్ లోని పెట్టుబడిదారులతో పాటూ… ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ సమ్మిట్ ను ఉద్దేశించి ప్రధాని వర్చువల్ గా ప్రసంగించారు. గ్లోబల్ క్రైసెస్ సమయంలో కూడా ఆర్థిక వేత్తలు, నిపుణులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రశంసిస్తున్నారన్నారు. పెట్టుబడి దారులను రెడ్ టాపిజం నుంచి విముక్తి చేశామని చెప్పారు. అలాగే వారికి రెడ్ కార్పెట్ అవకాశాలు కల్పించామన్నారు.
Delivering inaugural address at Global Investors Meet ‘Invest Karnataka 2022’. https://t.co/l77x7Rbft4
— Narendra Modi (@narendramodi) November 2, 2022
గతంలో మూసివేయబడిన ప్రైవేటు పెట్టుబడులను కూడా ప్రోత్సహించామన్నారు. నవభారత నిర్మాణంలో భాగంగా వివిధ రంగాలలో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.యూపీఐ ద్వారా డిజిటల్ విప్లవం వచ్చిందన్నారు. గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా ప్రపంచస్థాయి మౌలికసదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కర్నాటక రాష్ట్రం ఐటీ, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో అగ్రస్థానంలో కొనసాగుతుందన్నారు. కరోనా తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ప్రధాని మోడీ అన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రాథమిక అంశాలపై పనిచేస్తున్నామని తెలిపారు. అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు, నిపుణులు భారతదేశాన్ని మాత్రం ఆర్థిక సంక్షోభం నుంచి శరవేగంగా బయటపడుతుందని చెప్పినట్లు గుర్తు చేశారు. స్తున్నారు. వివిధ దేశాలతో కేంద్రం చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. మ












