మోర్బీ బాధితులకు అండగా వుంటాం… భరోసా ఇచ్చిన ప్రధాని మోదీ

గుజరాత్ లోని మోర్బీ టౌన్ లో కూలిపోయిన కేబుల్ బ్రిడ్జి ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం పరిశీలించారు. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ పై రివ్యూ చేశారు. మోర్బీ సివిల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని సీఎం భూపేంద్ర పటేల్ తో కలిసి పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబసభ్యులను కూడా మోడీ పరామర్శించారు. మోర్బీ టౌన్ వద్ద మచ్చూ నదిపై ఉన్న 140 ఏండ్ల నాటి కేబుల్ బ్రిడ్జి ఆదివారం కుప్పకూలగా, ఇప్పటివరకు 141 మంది మృతదేహాలను వెలికితీశారు.

 

 

మోర్బీలో బ్రిడ్జి కూలిన ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ తో విచారణ చేయించాలంటూ దాఖలైన పిల్ ను ఈ నెల 14న విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలోని కమిషన్ ద్వారా విచారణ జరగాలంటూ అడ్వకేట్ విశాల్ తివారీ వేసిన పిల్ ను సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన బెంచ్ మంగళవారం విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే బ్రిడ్జి కూలిందని పిటిషనర్ పేర్కొన్నారు.

 

Related Posts

Latest News Updates