మునుగోడు బైపోల్ ప్రచారం సమయం ముగుస్తున్నా కొద్ది.. ఉత్కంఠత నెలకొంటుంది. మునుగోడు మండలం పలివెలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. దీంతో ఈటల కారు ధ్వంసమైంది. ఈ పని పక్కా టీఆర్ఎస్ కార్యకర్తల పనేనని బీజేపీ మండిపడింది. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అయితే… పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఈటల తీవ్రంగా మండిపడ్డారు.

 

 

వారి కళ్ల ముందే జరుగుతున్నా… ఆపలేకపోయారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ సమక్షంలో దాడి జరిగిందని, పల్లాయే దగ్గరుండి తమపై దాడి చేయించారని ఈటల ఆరోపించారు. తాను, తన సతీమణి భోజనం కోసం వచ్చామని, ఇదే సమయంలో ప్రణాళిక ప్రకారం కొందరు వచ్చి, తమపై రాళ్ల దాడికి దిగారని మండిపడ్డారు. భౌతికదాడులు, దాడులకు తాము వ్యతిరేకమన్నారు. అయితే.. ఇలాంటి చిల్లవేషాలు తమకేమీ కొత్త కావని ఈటల పేర్కొన్నారు.