ముందు అమేథీలో గెలవాలంటూ రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్ కి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కన్న కూతురునే ఎంపీగా గెలుచుకోలేని మీరు.. మాట్లాడతారా? అని మండిపడ్డారు. జాతీయ నాయకుడినని డబ్బా కొట్టుకుంటున్న నేత రాజకీయ జీవితం కూడా ఓటమితోనే మొదలయ్యిందన్న సంగతి గుర్తుందా? ఎవరైనా గుర్తు చేయడండ్రా బాబూ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. అయితే… ఇందులో రేవంత్ కేటీఆర్ ను డ్రామారావు అంటూ హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.
కన్న కూతురునే ఎంపీగా గెలిపించుకోలేని…
మీరు డబ్బా కొట్టుకున్న ‘జాతీయ’ నాయకుడి రాజకీయ జీవితం ఓటమితోనే మొదలయ్యిందన్న సంగతి గుర్తుందా…!?
ఎవరన్నా గుర్తు చేయండ్రా బాబూ…!?#DramaRao https://t.co/nZPxv73w8J— Revanth Reddy (@revanth_anumula) November 1, 2022







