స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన టాటా స్టీల్ మాజీ ఎండీ, పద్మభూషణ్ జంషెడ్ జే ఇరానీ (86)కన్నుమూశారు. ఈ విషయాన్ని టాటా స్టీల్ ప్రకటించింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ… సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారని టాటా తెలిపింది. దాదాపు 45 సంవత్సరాల పాటు ఆయన వివిధ హోదాల్లో సేవలందించారు. 2011 లో టాటా స్టీల్ బోర్డు నుంచి పదవీ విరమణ చేశారు. 1978 లో జనరల్ సూపరింటెండెడ్ గా, 1979 లో జనరల్ మేనేజర్ గా, 1985 లో టాటా స్టీల్ అధ్యక్షునిగా, 1988 లో టాటాస్టీల్ జాయింట్ ఎండీగా, 1992 లో ఎండీగా పనిచేసి, 2011 లో పదవీ విరమణ పొందారు.












