ఓటుకి నోటు కేసులో దొరికి రెండేళ్లకే హైదరాబాద్ ఖాళీ చేసేశారు : ధర్మాన ఎద్దేవా

అభివృద్ధి అసమానత వుంటే రాష్ట్రంలో అస్థిరత ఏర్పడుతుందని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించారు. ఏపీకి ఒకే రాజధాని పెట్టడం మంచిదని కేంద్ర కమిటీ చెప్పిందని, ఏపీ రాజకీయ పరిస్థితులను బట్టి పరిపాలన వికేంద్రీకరణ చేయాలని గతంలోనూ డిమాండ్లు వచ్చాయని గుర్తు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజీలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి ధర్మాన ప్రసంగించారు. మంత్రి పదవి కంటే తనకు ప్రాంతమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ స్థితికి తీసుకొచ్చిన ప్రజల బాగోగులే ముఖ్యమన్నారు.

 

 

నిజానికి పదేళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా వుంటుందని చట్టంలో వున్నా… ఓటుకు నోటు కేసులో దొరికి చంద్రబాబు రెండేళ్లకే ఖాళీ చేశారని ఎద్దేవా చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో హైకోర్టు ఓ దగ్గర, పరిపాలనా రాజధాని మరో దగ్గర వున్నాయని అన్నారు. రాజ్యాంగం చెబుతున్నా, కమిటీలు చెబుతున్నా… చంద్రబాబు ఎందుకు పెద్ద క్యాపిటల్ ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. చంద్రబాబుకు రియల్ ఎస్టేట్ తప్ప మరేమీ రాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విశాఖే పెద్ద పట్టణమని, రాజధానికి అవకాశం వున్న ఒకే ఒక పట్టణం విశాఖ అని ధర్మాన తేల్చి చెప్పారు.

Related Posts

Latest News Updates