దేశంలో ఇదే తరహా పాలన కొనసాగితే దేశం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలన వల్ల దేశంలో ప్రజాస్వామ్యం ఉక్కిరి బిక్కిరి అవుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య నిర్మాణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ పై వుందన్నారు. కోల్కతాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎన్యూజేఎస్) కాన్వొకేషన్కు సీజేఐ జస్టిస్ లలిత్ వీసీగా హాజరయ్యారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం మమతా బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. అధికారమంతా ఓ వర్గం చేతిలోనే వుందని, ప్రజలను వేధింపుల నుంచి రక్షించాలని సీఎం కోరారు. తీర్పులు వెలువడక ముందే చాలా పరిణామాలు జరిగిపోతున్నాయని, ఈ మాట చెప్పడానికి తాను చాలా విచారిస్తున్నానని, తన మాటలు తప్పనుకుంటే క్షమాపణలు చెప్పుకుంటానని సీఎం మమతా అన్నారు.












