కాకినాడలో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్’ క్యాంపస్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రులు

కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూశ్ గోయల్ ఏపీలో పర్యటిస్తున్నారు. కాకినాడలోని JNTUలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్” కాకినాడ క్యాంపస్ ను నిర్మలా సీతారామన్, పీయూశ్ గోయల్ కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను తెచ్చి రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాన మంత్రి మోదీ ప్రత్యేక దృష్టి సారించారని పీయూశ్ పేర్కొన్నారు. కాకినాడ వంటి వాణిజ్య ఎగుమతుల కేంద్రంలో ఈ సంస్థ రావడం రాష్ట్రానికి, దేశానికీ కూడా ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని అన్నారు. ప్రధాని మోదీ ఓ విజన్ తో పనిచేస్తున్నారని, అందుకే భారత్ ప్రపంచ వ్యాప్తంగా ముందుకెళ్తోందన్నారు. సౌత్ ఇండియాలోనే తొలి ఐఐఎఫ్టీ క్యాంపస్ కాకినాడలో ఏర్పాటు కావడం ఎంతో సంతోషమన్నారు.

 

 

ఇక… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… విభజన తర్వాత ఏపీకి 10 కేంద్ర విద్యా సంస్థలు వచ్చాయని గుర్తు చేశారు. ఏపీకి కేటాయింపులు చేసే విషయంలో ప్రధానికి రెండో ఆలోచన లేదని స్పష్టం చేశారు. మెరైన్ ప్రొడక్ట్ ను ఎగుమతి చేయడంలో ఏపీ ముందుందని ప్రశంసించారు. కోల్ కతా, ఢిల్లీ తర్వాత ఏపీలోనే ఐఐఎఫ్టీ ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆమె వివరించారు.

Related Posts

Latest News Updates