ప్రధాని మోదీ గొప్ప దేశ భక్తుడు… భవిష్యత్తు అంతా భారత్ దే : పుతిన్ ప్రశంసలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశభక్తుడని రష్యా ప్రధాని వ్లాదిమీర్ పుతిన్ కొనియాడారు. మోదీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుండటం ప్రశంసనీయమని చెప్పారు. మాస్కోలో గురువారం జరిగిన ‘వాల్డాయ్ డిస్కషన్ క్లబ్’ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎంతో కృషి జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఆయన తన దేశానికి భక్తుడు అని, ఆయన అనుసరిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ సిద్ధాంతం అటు ఆర్థికపరంగా, ఇటు నైతిక విలువల పరంగా చాలా ముఖ్యమైనదని వివరించారు. భవిష్యత్తు భారత దేశానిదేనని పుతిన్ ప్రకటించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత దేశం అనే వాస్తవం గర్వకారణం అని చెప్పారు.

 

 

భారత దేశ వృద్ధి అద్భుతమని తెలిపారు. 150 కోట్ల మంది ప్రజలు, స్పష్టమైన అభివృద్ధి ఫలాలు భారత దేశాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, మెచ్చుకోవడానికి కారణాలని వివరించారు. భారత్, రష్యా మధ్య సంబంధాలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. అనేక దశాబ్దాల నుంచి సన్నిహిత మైత్రీ సంబంధాల బలమైన పునాదులు ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య సంక్లిష్ట సమస్యలేవీ ఎన్నడూ ఎదురు కాలేదని, ఒకరికొకరం మద్దతిచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Posts

Latest News Updates