ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత అలీకి ఎట్టకేలకు వైసీపీ నామినేట్ పోస్ట్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం ఆయన్ను రాజ్యసభకు పంపనున్నారని, అందుకే సీఎం జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారని బాగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ విషయంపై పార్టీ గానీ, అలీ గానీ ఏమీ మాట్లాడనేలేదు. తాజాగా… ఏపీ ప్రభుత్వం ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా (ఎలక్ట్రానిక్ మీడియా) నియమించింది. ఈ పదవిలో ఆయన 2 సంవత్సరాలు కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక.. జీత భత్యాలు, అలవెన్సులకు సంబంధించి విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని జీవోలో పేర్కొంది.













