ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్‌ఎస్‌ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తిచేశారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారని, వాటిని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని గురువారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.