నెల్లూరు జిల్లాలోని నేలటూరులో జెన్ కో మూడో యూనిట్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత కృష్ణపట్నం పోర్టు పరిధిలో చేపల వేటకు అనువుగా 25 కోట్ల వ్యయంతో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. తన తండ్రి శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును ప్రారంభించడం తనకు ఆనందంగా వుందన్నారు. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో నేడు మరో ముందడుగు పడిందన్నారు. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన జెన్ కో మూడో యూనిట్ ను జాతికి అంకితం చేస్తున్నామని అన్నారు.

వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరాకు తాము చర్యలు చేపట్టామని సీఎం జగన్ వివరించారు. ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు ప్రకటించారు. విద్యుత్ ప్రాజెక్టులకు భూములిచ్చిన 326 కుటుంబాలకు ఇప్పటికే తాము ఉద్యోగాలిచ్చామని, మరో 150 కుటుంబాలకు నవంబర్ లో ఉద్యోగాలిస్తామని ప్రకటించారు. వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరాకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఈ థర్మల్ పవర్ స్టేషన్ కు మన ప్రభుత్వంలో 3,600 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు.
కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్లో 800మెగావాట్ల మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్. 16,337 మత్స్యకారేతర కుటుంబాలకు రూ.36కోట్ల ప్యాకేజీ పంపిణీ. pic.twitter.com/Rrfec5tcf5
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 27, 2022















