మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో 500 రోజుల్లో అభివృద్ధి​ చేస్తానని ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా రూ.625 కోట్లతో పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేశానని రాజగోపాల్​ రెడ్డి తెలిపారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. మునుగోడు క్యాంపు ఆఫీసులో స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్యే ఈటల, ఎంపీ ధర్మపురి అర్వింద్ మేనిఫెస్టోను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ ఫండ్స్​తో నియోజకవర్గ అభివృద్ధికి మెగా మాస్టర్​ ప్లాన్​ రూపొందించామని కోమటిరెడ్డి ప్రకటించారు.

 

తాము మునుగోడులో గెలిస్తే… 200 కోట్లతో రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చేనేత కార్మికుల ఉపాధి కోసం కేంద్ర టెక్స్​టైల్స్​ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూ.100 కోట్ల పె ట్టుబడితో నారాయణపూర్​ మండల కేంద్రంలో టెక్స్​టైల్స్​ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్​ బాధితుల కోసం నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ న్యూట్రిషన్​ హైదరాబాద్​ సంస్థ ఆధ్వర్యంలో మునుగోడులో రూ.100 కోట్ల తో వంద పడకలతో రీసెర్స్​ సెంటర్ కమ్​​హాస్పిటల్​ నిర్మిస్తామని తెలిపారు.

 

కేంద్రం ద్వారా రూ.25 కోట్లతో చౌటప్పుల్​ పట్టణంలో ఆధునిక హంగులతో ఐటీఐ ఏర్పాటు చేస్తామని, మర్రిగూడలో కేంద్ర విద్యాశాఖ ద్వారా నవోదయ పాఠశాల నిర్మిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వీటితో పాటు సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద రూ.100 కోట్లతో చౌటుప్పల్​ మండలంలో మూసీనదిపై ఎత్తిపోతల స్కీం ఏర్పాటు, మునుగోడు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉపాధి క ల్పించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం దేశ వ్యాప్తంగా వివిధ ప్రైవేటు రంగ కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరిపి..నారాయణపూర్​, చౌటుప్పుల్​, చండూరు మండల కేంద్రాలలో వంద రోజుల్లో మెగా ఉద్యోగ మేళాల నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.