అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యవహారం తెలంగాణలో కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కొందరు రంగంలోకి దిగారన్న సమాచారంతో మొయినాబాద్ లోని ఓం ఫామ్ హౌజ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే… దీనిని నిరసిస్తూ తెలంగాణ మంత్రులు చౌటుప్పల్ లోని విజయవాడ హైవేపై మెరుపు ధర్నాకు దిగారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి, నిరసనకు దిగారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రుల ధర్నాతో జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.