‘మనకి తెలిసింది గోరంత..తెలియాల్సింది కొండంత’ కాంతార సినిమా పై సూపర్ స్టార్ ప్రశంశ!

రజినీకాంత్ చాలా రోజుల తర్వాత ఓ సినిమా గురించి ప్రస్తావించారు. కాంతార మూవీని తాజాగా చూసిన సూపర్ స్టార్ ఆ టీమ్‌కి అభినందలు తెలియజేశారు. అలానే ఓ డైలాగ్‌ని కూడా తన స్ట్రైల్‌లో విసిరారు. సౌత్ ఇండియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ‘కాంతార’ సినిమాని సూపర్ స్టార్ రజనీకాంత్  తాజాగా వీక్షించారు. కన్నడలో విడుదలైన ఈ మూవీ మౌత్ టాక్‌తో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. దాంతో మిగిలిన భాషల్లో కూడా ఆ సినిమాని రిలీజ్ చేయగా.. విడుదలైన అన్ని లాంగ్వేజెస్‌లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. తమిళ్ వర్షన్‌లో తాజాగా కాంతార  సినిమాని చూసిన రజనీకాంత్.. మూవీ యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలో తన స్ట్రైల్‌లో ఓ డైలాగ్‌ని కూడా సూపర్ స్టార్ వదిలారు. ‘‘మనకి తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. ఆ విషయాన్ని సినిమాల ద్వారా హోంబలే ఫిలిమ్స్ కంటే ఎవరూ గొప్పగా చెప్పలేరు. కాంతార మూవీ చూస్తున్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. రైటర్, డైరెక్టర్, యాక్టింగ్‌లో రిషబ్ శెట్టి స్కిల్స్‌కి హ్యాట్సాప్. ఇండియన్ సినిమాకి మాస్టర్ పీస్‌ లాంటి సినిమా తీసిన టీమ్ మొత్తానికీ అభినందనలు’’ అని రజనీకాంత్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. కర్ణాటక‌లోని తుళునాడులో ప్రసిద్ధి చెందిన ‘భూతకోల’ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా వచ్చింది. సినిమా చివరి 15 నిమిషాల్లో రిషబ్ శెట్టి నటనటకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి కనబర్చారంటే ఎంత పాపులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.

Related Posts

Latest News Updates