హైదరాబాద్ చిక్కడపల్లిలోని అర్చనా అపార్ట్ మెంట్ లో హిందువులు దీపావళి పండగ జరుపుకునే సమయంలో పక్కనే వున్న క్రిస్టియన్ కుటుంబం గొడవకు దిగింది. దీపావళి సందర్భంగా ఖాళీ స్థలంలో హిందూ కుటుంబం ముగ్గులు వేసి, అందంగా తీర్చిదిద్దింది. దీనిపై క్రిస్టియన్ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా హిందూ కుటుంబాన్ని నానా దుర్భాషలాడింది. హిందూ కుటుంబం కూడా అంతే స్థాయిలో విరుచుకుపడింది.
చివరికి హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని, అపార్ట్ మెంట్ ముందు నిరసనకు దిగాయి. హిందూ కుటుంబంపై దుర్భాషలాడిన క్రిస్టియన్ కుటుంబంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మరోవైపు రంగోలి వేసినందుకే గొడవకు దిగిన క్రిస్టియన్ కుటుంబంపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. తదుపరి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.