ప్రధాని నరేంద్ర మోదీ తన దీపావళి పండగను కార్గిల్ లోని జవాన్లతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా జవాన్లతో కలిసి వందే మాతరం ఆలాపించారు. ఈ సందర్భంగా ప్రధాని జవాన్లతో ముచ్చటించారు. అయితే… ఓ మేజర్ విషయంలో ఆశ్చర్యం జరిగింది. ఆ మేజర్ పేరు అమిత్. 2001 లో మోదీ గుజరాత్ లోని సైనిక్ స్కూల్ ను సందర్శించారు. ఆ సమయంలో ఈ మేజర్ అమిత్ సైనిక్ స్కూల్ విద్యార్థి. అప్పుడు అక్కడ మోదీని కలుసుకున్నారు. మళ్లీ ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత అమిత్ కార్గిల్ లో మళ్లీ మేజర్ హోదాలో మోదీని కలుసుకున్నారు. అప్పట్లో తాను చిన్నగా వున్నప్పుడు మోదీ నుంచి బహుమతి అందుకున్న ఫొటోను మేజర్ అమిత్ ప్రధాని మోదీకి అందజేశారు.