అభిమానం హద్దులు దాటింది! ప్రభాస్’బిల్లా’ 4కే థియేటర్లో అగ్నిప్రమాదం

ప్ర‌భాస్ పుట్టినరోజు సందర్భంగా… ప్ర‌భాస్ హీరోగా న‌టించిన బిల్లా సినిమాను 4కె టెక్నాల‌జీతో ప‌లు చోట్ల స్పెష‌ల్ షోగా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే ఈ ప్రదర్శనలో అపశృతి జరిగింది, అభిమానం హ‌ద్దుల్లో ఉంటే బావుంటుంది. కానీ కొన్ని సార్లు ఆ హ‌ద్దులు దాటే అభిమానం ప‌క్క వారి ఇబ్బంది పెడుతుంది. భ‌యానికి గురి చేస్తుంది. ఇప్పుడు ప్ర‌భాస్  ఫ్యాన్స్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా అసలే అభిమాన హీరో ప్ర‌భాస్‌ బర్త్ డే ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ హీరోగా న‌టించిన బిల్లా  సినిమాను..  వెస్ట్ గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లి గూడెం వెంక‌ట్రామ థియేట‌ర్‌లో స్పెష‌ల్ షోగా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. భారీగా ప్ర‌భాస్ అభిమానులు థియేట‌ర్‌కు చేరుకున్నారు. అభిమాన హీరో న‌టించిన సినిమా థియేట‌ర్‌లో ఉంటే అభిమానులు ఊరుకుంటారా! గోల గోల చేస్తారు. అలా గోల చేస్తున్న త‌రుణంలో కొన్ని యాక్ష‌న్ సీన్స్ వ‌చ్చాయి. కొంద‌రు ప్ర‌భాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో థియేట‌ర్‌లోనే బాణా సంచా కాల్చారు. దాంతో థియేట‌ర్‌లో మంట‌లు చేల‌రేగాయి. కొన్ని సీట్లు కూడా పాక్షికంగా కాలిపోయాయి. దీని వ‌ల్ల థియేట‌ర్‌లో పొగ‌లు వ్యాప్తించాయి. కొంద‌రు ప్రేక్ష‌కుల‌కు ఏం జ‌రుగుతుందో తెలియ‌క ప్రాణ భ‌యంతో థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. కృష్ణంరాజు  చ‌నిపోయిన ఏడాది కావ‌టంతో ప్ర‌భాస్ పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉంటున్నారు. అభిమానుల‌ను కూడా పెద్ద‌గా వేడుక‌లు చేయ‌కండని ఆయ‌న చెప్పారు. ఫ్యాన్స్ కూడా ఆయ‌న మాట‌ల‌ను ఫాలో అవుతున్నారు. అయితే ప్ర‌భాస్ హీరోగా న‌టించిన బిల్లా సినిమాను 4కె టెక్నాల‌జీతో ప‌లు చోట్ల స్పెష‌ల్ షోగా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. హైదరాబాద్‌లో దేవి థియేటర్‌లో ప్రదర్శించిన బిల్లా స్పెషల్ షోకి దర్శకుడు మెహర్ రమేష్, ప్రభాస్ చెల్లెలు ప్రశీద హాజరయ్యారు. కృష్ణంరాజుని, ప్రభాస్‌ని మళ్లీ తెరపై చూస్తుంటే చాలా హ్యాపీగా ఎమోషనల్‌గా ఉందని ఆమె అన్నారు.

Related Posts

Latest News Updates