ప్రధాని పదవికి పోటీ చేస్తున్నా… కీలక ప్రకటన చేసిన రిషి సునాక్

బ్రిటన్ ప్రధాని పదవికి తాను పోటీ పడుతున్నట్లు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారికంగా ప్రకటించారు. బ్రిటన్ చాలా గొప్పదేశమని, అయితే.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వుందన్నారు. తాను ప్రధాని అయితే.. దేశ పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు. అందర్నీ ఏకతాటిపై నడిపిస్తానని, అందరి సమ్మతంతో దేశాన్ని కూడా ముందుకు నడిపిస్తానని ప్రకటించారు. ఈ మేరకు రిషి సునాక్ ట్వీట్ చేశారు. గతంలో తాను ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశానని గుర్తు చేశారు. ఆ అనుభవమే దేశాన్ని చక్కదిద్దడానికి తనకు ఉపకరిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత సమస్యల పరిష్కారానికి తనవద్ద స్పష్టమైన ప్రణాళిక వుందన్నారు. గతంలో తానిచ్చిన హామీలను నెరవేర్చిన రికార్డు కూడా తనకు వుందని ప్రజలకు గుర్తు చేశారు. సరైన వారిని ఎంపిక చేసుకుంటేనే దేశం బాగుటుందని అన్నారు.

 

లిజ్ ట్రస్ (Liz Truss) ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబరు 7న యూకే ప్రధానిగా (UK Prime Minister) ప్రమాణస్వీకారం చేసిన ఆమె కేవలం 44 రోజులకే రాజీనామా చేయడం గమనార్హం. దీంతో బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా లిజ్ ట్రస్ రికార్డులకెక్కారు. అనేక సవాళ్లు, యూకే ప్రజల అచంచల విశ్వాసం మధ్య యూకే ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె సారథ్యంలోని ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. లిజ్ ట్రస్ తీసుకున్న ఆర్థిక పరమైన నిర్ణయాలపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

 

Related Posts

Latest News Updates