ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ఓడిపోతోందంటూ ఆయన ఫోన్లో మాట్లాడిన మాటలు వైరల్ అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి తారిఖ్ అన్వర్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తాను మాట్లాడిన మాటలపై 10 రోజులుగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని ఆయన చెప్పిన రికార్డు వైరల్ అవుతోందని, ఇది పార్టీ క్రమ శిక్షణ కిందికే వస్తుందని అన్వర్ పేర్కొన్నారు.

 

పార్టీ రాజ్యాంగం ప్రకారం తమపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అన్వర్ పేర్కొన్నారు. కాగా… సరిగ్గా మునుగోడు ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో లీకైంది. దీంతో కాంగ్రెస్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలంటూ ఆయన సూచించారు. దీనిపై అధిష్ఠానం సీరియస్ అయ్యింది.