మనుగడ కోసం పర్యావరణాన్ని రక్షించుకోవాలి : ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్

ప్రపంచ మానవాళి భవిష్యత్తు, మనుగడ కోసం భూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. పర్యావరణ పరిరక్షణపై కెవాడియాలో నిర్వహించిన మిషన్ లైఫ్ కార్యక్రమంలో గుటెరస్ మాట్లాడుతూ గ్రీన్ హౌస్ వాయువులు ఒకటి లేదా రెండు శాతం పెరిగితే ప్రపంచవ్యాప్తంగా పేదరికం 50 శాతం పెరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, జీవవైవిద్యం కాపాడేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు.

 

 

ప్రపంచంలోని 80 శాతం కాలుష్యం జీ 20 దేశాల్లోనే ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆటోనియా గుటేరస్ తెలిపారు. అందుకే జీ 20 దేశాలు పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేయాలని సూచించారు. వ్యక్తులు, సంఘాలు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని గుటేరస్ చెప్పారు. మరోవైపు గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కెవాడియాలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తో సమావేశమయ్యారు. 10వ హెడ్స్ ఆఫ్ మిషన్స్ కాన్ఫరెన్స్‌లో భాగంగా సమావేశమైన ఇరువురు పలు అంశాలపై చర్చలు జరిగాయి.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్