ఏడు రాష్ట్రాల్లో గ్యాంగ్ స్టర్లు, ఉగ్రవాదులకు ఫండింగ్ చేసే వారు, డ్రగ్స్ సరఫరా దారులే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చేస్తోంది. నేటి ఉదయం నుంచే ఎన్ఐఏ ఈ దాడులు చేయడం ప్రారంభించింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేస్తోంది. దాదాపు 50 ప్రాంతాల్లో ఎన్ఐఏ ఈ దాడులు చేస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఎన్ఐఏ వీరందరిపై దాడులు చేసింది. అప్పట్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
మరో వైపు జమ్మూ కశ్మీర్ లో కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (sIU)ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పుల్వామా, హర్మెన్, సోఫియన్ ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి డ్రోన్లు అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ మధ్యే రెండు డ్రోన్లను బీఎస్ఎఫ్ కూల్చేసిన విషయం తెలిసిందే.