ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా, రాహుల్

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమెతో పాటు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సమయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని సోనియా ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం విశేషం. మరోవైపు మాజీ ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేత మన్మోహన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరే కాకుండా భారత్ జోడో యాత్రలో వున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా బళ్లారిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

 

ఇక… తెలంగాణ పీసీసీ భవన్ లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ తొలి ఓటు వేశారు. అనంతరం జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో పాటు వంశీచంద్ రెడ్డి తదితరులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Related Posts

Latest News Updates