కృష్ణానదిపై ‘ఐకానిక్ తీగల వంతెన’ నిర్మాణం… కీలక ట్వీట్ చేసిన గడ్కరీ

కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ విషయంలో మరో కీలక ప్రకటన చేశారు. కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మిస్తామని, అందుకు ఆమోదం కూడా లభించిందని కీలక ప్రకటన చేశారు. కృష్ణానదిపై 1,082.56 కోట్లతో ఐకానిక్ తీగల వంతెన నిర్మిస్తున్నామని, ఇది 30 నెలల్లో పూర్తవుతుందని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సిద్ధేశ్వరం, సోమశిల మధ్య నిర్మిస్తామని, శ్రీశైలం జలాశయం, నల్లమల్ల అడవి, ఎత్తైన పర్వతాల మధ్య నిర్మించే ఈ తీగల వంతెన పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

తెలంగాణ వైపున లలితాసోమేశ్వర ఆలయం, ఏపీ వైపున సంగమేశ్వర ఆలయాన్ని చూడడానికి ఆకర్షణీయ కేంద్రమన్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు శ్రీసత్యసాయి జిల్లాలోని ఎన్ హెచ్ 342 ను పుట్టపర్తి కోడూరు సెక్షన్ నుంచి రెండు నుంచి నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నట్లు కూడా గడ్కరీ ప్రకటించారు.

Related Posts

Latest News Updates