శరీరంలో బుల్లెట్లు దిగినా.. అనంతనాగ్ లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ఆర్మీ డాగ్ జూమ్ మరణించింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కన్నుమూసిందని అధికారులు పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ లో తీవ్రంగా గాయపడటంతో జూమ్ డాగ్ కు ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ రోజు 11:45 వరకూ డాగ్ చికిత్సకు స్పందించిందని, 12 గంటలకు కన్నుమూసిందని ఆర్మీ ప్రకటించింది. అనంతనాగ్ లోని కోకెర్ నాగ్ లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఓ స్థలంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు దాక్కున్నారు. వీరిని పసిగట్టి, ఆర్మీ అధికారులకు పట్టించింది జూమ్ డాగ్. అయితే.. ఈ సమయంలో ఉగ్రవాదులు దానిపై కాల్పులు జరిపారు. అయినా వీరోచితంగా పోరాడింది