ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలీవాల్ కు అత్యాచార బెదిరింపులు

తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలీవాల్ ఆరోపించారు. సినీ నిర్మాత సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ లోకి తీసుకోకూడదంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు లేఖ రాసిన నాటి నుంచే బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇలా బెదిరింపులకు దిగే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని తాను ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేయమని కోరానని ఆమె వెల్లడించారు. హిందీ బిగ్ బాస్ 16 సీజన్ లో సాజిద్ ఖాన్ పాల్గొనడంపై స్వాతి మాలీవాల్ స్పందించారు. మీటూ ఉద్యమ కాలంలో ఆయనపై 10మంది మహిళలు కంప్లైంట్ చేశారని, ఆయన్ను షో నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవలే కేంద్రమంత్రికి లేఖ రాశారు.

Related Posts

Latest News Updates