ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మెడికల్ రీఎంబర్స్ మెంట్ పథకం గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. 1 ఆగస్ట్ 2022 నుంచి 31 మార్చి 223 వరకూ రీఎంబర్స్ మెంట్ పథకం గడువును పొడిగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా ఈ పథకం పొడిగింపు వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అనుబంధంగానే ఈ పథకం అమలులో వుంటుందన్నారు. పలు ఉద్యోగ సంఘాలు చేసిన సూచనల ఆధారంగానే మరింత కాలం దీనిని పొడిగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఇహెచ్ఎస్ పథకాన్ని సులభతరం చేసేందుకు అనువైన విధానాన్ని అందుబాటులోకి తేవాలని సూచించారు.