ఆక్వా రైతుల సమస్యలపై మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ సీఎం జగన్

సిండికేట్ల వల్ల తాము బాగా నష్టపోతున్నామని ఆక్వా రైతులు ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. దీనిపై ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, సీదిరి అప్పలరాజుతో పాటు సీఎస్, సీనియర్ అధికారులు విజయానంద్, పూనం మాలకొండయ్య సభ్యులుగా వున్నారు. వీరు ఆక్వా రైతుల సమస్యలను అధ్యయనం చేసి, వారం రోజుల్లోగా ఓ నివేదిక అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. తమకు అన్యాయం జరుగుతోందని ఆక్వా రైతులు సీఎం కి చెప్పడంతో, సీఎం చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

 

ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్ ధర పెంపుపై ఆక్వా రైతులు సీఎం జగన్ కి ఫిర్యాదు చేశారు. వ్యాపారులు సిండికేట్ గా మారి, ధరలు తగ్గిస్తున్నారని ఆక్వా రైతులు సీఎం జగన్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను సీఎం తీవ్రంగా పరిగణించారు. రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని తీవ్రంగా హెచ్చరించారు.

 

Related Posts

Latest News Updates