లక్షల జీతం … అయినా సరే స్వదేశానికి

ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మమకారంతో డీఎస్సీ-98 క్వాలిఫై అయిన ఎంతోమంది అభ్యర్థులు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో సుదీర్ఘకాలం ఎదురు చూశారు. వీరిలో అర్హత కలిగిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని తాజాగా న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రభుత్వం ఈ ప్రక్రియ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో  తిరుపతి జిల్లా  దాంతో దొరవారిసత్రం మండలం కల్లూరి కండ్రిగకు  చెందిన మునుస్వామి కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వచ్చారు. 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థి కావడంతో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలన్న తన జీవితాశయం మేరకు.. దుబాయ్లో రూ.లక్షల జీతాన్ని వదులుకుని ఇటీవల స్వదేశానికి చేరుకున్నారు. సర్టిఫికెట్లు పరిశీలిస్తున్న అధికారులు ఆయన వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టమని, దీనికోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని మునుస్వామి తెలిపినట్లు అధికారులు చెప్పారు. మునుస్వామి దుబాయ్లో 15 ఏళ్లుగా ఓ కంపెనీలో పని చేస్తూ నెలకు రూ.2.5 లక్షల జీతం. అక్కడే స్థిరపడ్డారు.

Related Posts

Latest News Updates