తెలుగులో మరో సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కబోతోంది. ధార్వి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం స్క్రిప్టు పూజా కార్యక్రమం విజయదశమి రోజున లాంఛనంగా జరిగింది. ఉత్తేజ్, బ్రహ్మజీ, ప్రభాస్ శ్రీను , ప్రొఫెసర్ దేవన్న, బేబి ధార్వి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని లెక్కల మహేంద్రా రెడ్డి నిర్మిస్తుండగా ,వూర శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా పూజా కార్యక్రమంలో డైరెక్టర్ వి. సముద్ర, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. నిర్మాత బాలబ్రహ్మచారి, మన్నెపల్లి అప్పారావు, శ్రీలక్ష్మి, పి. జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ వి. సముద్ర, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత లెక్కల మహేంద్రా రెడ్డి, నిర్మాత బాలబ్రహ్మచారి, మన్నెపల్లి అప్పారావు, శ్రీలక్ష్మి చేతుల మీదుగా స్క్రిప్టుని డైరెక్టర్ వూర శ్రీనుకు అందించారు. ఈ చిత్రానికి మాటలు బాపరాజు ఆంజనేయులు, పాటలు కళారత్న బిక్కి కృష్ణ, ఎస్ జయసాగర్ మాస్టర్. ఈ నెల 25 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. హీరోహీరోయిన్‌లు కొత్తవారు నటించనున్నారు.