విశాఖను రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేసిన ఆయన…. ఆ లేఖను జేఏసీ ప్రతినిధులకు అందజేశారు. విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా జరుగుతున్న జేఏసీ మీటింగ్ లో కరణం ధర్మశ్రీ ఈ నిర్ణయం తీసుకున్నారు. దమ్ముంటే అమరావతికి మద్దతుగా అచ్చెన్నాయుడు కూడా రాజీనామా చేయాలని కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు.
విశాఖను రాజధానిగా అమరావతి రైతులు వ్యతిరేకిస్తే.. తాము కూడా అమరావతికి వ్యతిరేకమేనని అన్నారు. కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకించే నాయకులను రాజకీయాల నుంచే వెలివేయాలని సంచలన పిలుపునిచ్చారు. వారం రోజుల పాటు నియోజక వర్గ కేంద్రాల్లో సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తామని, ఈ నెల 15 న భారీ ప్రదర్శన నిర్వహిస్తామని కరణం ధర్మశ్రీ ప్రకటించారు.