మునుగోడు ఉప ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు బీ ఫామ్ అందజేశారు. అంతేకాకుండా ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ ఫండ్ నుంచి 40 లక్షల చెక్కును కూడా అందజేశారు. ఇక… బైపోల్ లో తనకు అవకాశమిచ్చినందుకు కూసుకుంట్ల సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు ప్రకటించారు.

 

 

ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కడి నుంచి నిధులు తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని 22 వేల కోట్లకు అమ్ముకున్నారని కూసుకుంట్ల ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మబోరన్నారని పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీ మూడో స్థానంలో ఉందని.. మునుగోడులో బీజేపీని జాకీలు పెట్టి లేపినా లేవని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీని ప్రజలు నమ్మట్లేదని.. బండి సంజయ్ వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. మునుగోడులో బీజేపీ డబ్బులు పంచుతుందని కూసుకుంట్ల ఆరోపించారు.