RC16, RC17 లను లైన్ లో పెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ : U V క్రియేషన్స్ అండ్ డి వి వి బ్యానర్ లలో….

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెండితెర అరంగేట్రం చేసి 15 ఏళ్లు పూర్తయ్యింది. ఈ 15 ఏళ్లలో ఆయన చేసిన పాత్రలు, ఎంచుకున్న కథలు, పడిన కష్టం ఆయన్ని స్టార్ హీరోల్లో ఒకడిని చేశాయి. మెగాస్టార్ చిరంజీవికి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు ఈ మెగా పవర్ స్టార్. ‘చిరుత’తో ప్రేక్షకులకు పరిచయమైన ఈ మెగా హీరో.. ‘మగధీర’, ‘ఎవడు’, ‘ధృవ’, ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో తన మార్కెట్‌ను అమాంతం పెంచుకున్నారు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ అంటే ఎవరో ప్రపంచానికే తెలిసింది. ఆర్ఆర్ఆర్ తో దేశ వ్యాప్తంగా వచ్చిన స్టార్ ఇమేజ్‌ను మరింత పెంచుకునే పనిలో ప్రస్తుతం చెర్రీ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టే పనిలో ఉన్నారు. ప్రస్తుతం RC15 షూటింగ్‌తో బిజీగా ఉన్న ఆయన.. దాని తరవాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేసేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఆయన సినిమా చేయబోతున్నారు. రామ్ చరణ్ 15వ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. మరి 16వ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు.. హీరోయిన్ ఎవరు వంటి విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే దిగ్గజ దర్శకుడు శంకర్‌తో పాన్ ఇండియా ఫిలిం చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఆ సినిమాను ప్రస్తుతం RC15గా పిలుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ‘వినయ విధేయ రామ’ చిత్రంలో చెర్రీతో జతకట్టిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. RC15లోనూ చరణ్‌తో రొమాన్స్ చేస్తోంది. సుమారు రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే, ఈ సినిమా తరవాత చరణ్ చేయబోయే ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా అప్‌డేట్ వచ్చింది. ప్రభాస్ కజిన్ ప్రమోద్ ఉప్పలపాటికి చెందిన యూవీ క్రియేషన్స్‌లో చరణ్ సినిమా చేయబోతున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కన్ఫర్మ్ చేస్తూ సినీ వర్గాల నుంచి అప్‌డేట్ వచ్చింది. చరణ్ తన 16వ సినిమాను యూవీ క్రియేషన్స్‌లో చేస్తున్నారు. RC15 షూటింగ్ పూర్తికాగానే.. RC16 షూటింగ్ మొదలవుతుందట. ఈ సినిమాకు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, దానిపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టత లేదు. త్వరంలోనే యూవీ క్రియేషన్స్ దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనుంది. ఇదిలా ఉంటే, రామ్ చరణ్ 17వ సినిమాపై కూడా ఒక గాసిప్ ఉంది. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో చరణ్ తన 17వ సినిమా చేయబోతున్నారట. RRR నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. ఇది కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందట. మొత్తానికి రామ్ చరణ్ భారీ సినిమాలనే లైన్‌లో పెట్టారు. ఆయన వరుసగా విజయాలు అందుకోవాలని శుభాకాంక్షలు తెలియజేద్దాం.

Related Posts

Latest News Updates