తెలంగాణ భవన్ లో దసరా నాడు (అక్టోబర్ 5) ఉదయం 11 గంటలకు తలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ యధావిధిగా జరగుతుందని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో దాని ప్రభావం, దసరా నాటి టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం పైన ఉండదని, సభ్యులు అనుమానాలకు గురికావద్దని అన్నారు. ముందుగా ప్రకటించినట్టే అక్టోబర్ 5 వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. అందరూ నిర్దేషిత సమయంలోపే హాజరుకావాలన్నారు.