నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘దసరా’ నుండి మాస్ , రగ్గడ్ డ్యాన్స్ మూవ్‌లతో కూడిన మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ దసరా రోజున విడుదల కానుంది. సంతోష్ నారాయణ్ స్వరపరిచిన ధూమ్ ధామ్ ధోస్థాన్ పాటలో బొగ్గు గనుల్లో తన స్నేహితులతోపాటు అద్భుతమైన డ్యాన్స్‌లతో అలరించబోతున్నారు నాని. తాజాగా ఈ పాట నుండి విడుదలైన పోస్టర్ నాని రా, రస్టిక్ గెటప్ ఊహతీతంగా వుంది. నాని లుక్ ద్వారా ఆయన పాత్ర యొక్క రగ్గడ్ నెస్ ని ఊహించవచ్చు. గుబురు గడ్డం,మాసీ జట్టు, లుంగీ ధరించి, లోపల బనియన్, ఓపెన్ షర్టుతో మిలియన్ డాలర్ల చిరునవ్వుతో మెస్మరైజ్ చేశారు నాని. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జాతీయ అవార్డువిన్నర్ కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించనుంది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 30 మార్చి 2023న విడుదల కానుంది. తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు. సాంకేతిక విభాగం : దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల నిర్మాత: సుధాకర్ చెరుకూరి బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ డీవోపీ: సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సీ సంగీతం: సంతోష్ నారాయణన్ ఎడిటర్: నవీన్ నూలి ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ : విజయ్ చాగంటి ఫైట్స్: అన్బరివ్