మోహినీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు..

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి వారు మోహినీ అవతారంలో మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని దర్శించుకోవడం కోసం పెద్ద సంఖ్యలో తరిలి వచ్చారు. క్షీర సాగర మథనంలో మోహినిగా స్వామి వారు ఉద్భవించారు. మాయా జగత్తు నుంచి భక్తులను బయటపడటమే మోహినీ రూపం పరమార్థం. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో అలిపిరి దగ్గరే వాహనాలను నిలిపేస్తున్నారు. అలిపిరి నుంచి ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారు. తిరుపతిలో 13 చోట్ల టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

Related Posts

Latest News Updates