నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నేడు నోటీసులు జారీ చేసింది. పార్టీకి, దాని అనుబంధ సంస్థలకు విరాళాలిచ్చిన రాష్ట్ర నేతలకు ఈడీ నోటీసులు పంపింది. ఈ జాబితాలో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి, రేణుకా చౌదరితో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వున్నారు. వీరందరికీ ఈడీ నోటీసులు పంపింది. మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం వారందర్నీ ఢిల్లీకి పిలిచింది. దీంతో వీరందరూ ఢిల్లీకి వెళ్లారు. ఈ సమావేశంలో ఆడిట్ పరంగా, న్యాయపరంగా వీరితో చర్చలు జరపనున్నారు.