భారత త్రివిధ దళాల నూతన అధిపతి(సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. భార్య అనుపమా చౌహాన్తో కలిసి ఆయన ఇవాళ సీడీఎస్ ఆఫీసుకు వచ్చారు. అంతకు ముందు ఆయన నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత సౌత్ బ్లాక్ లో సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అత్యున్నత బాధ్యతలు చేపట్టినందుకు గర్వంగా ఉందని అనిల్ చౌహాన్ తెలిపారు.
త్రివిధ దళాల అంచనాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అన్ని సవాళ్లు, ఇబ్బందులను సమిష్టిగా ఎదుర్కొంటామని తెలిపారు. భారత సైనిక దళాల్లో అత్యధిక ర్యాంకు దక్కడం గర్వంగా వుందని అన్నారు. త్రివిధ దళాల ఆశయాలకు తగినట్టుగా పనిచేస్తానని పేర్కొన్నారు. అన్ని సవాళ్లను, అవరోధాలను కలిసి కట్టుగానే ఎదుర్కొంటామని అనిల్ చౌహాన్ తెలిపారు.