గాంధీ నగర్- ముంబై మధ్య వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులుగా గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు గాంధీనగర్- ముంబై మధ్య సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆయన ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైలెక్కి అందులోని వసతులను పరిశీలించారు. అహ్మదాబాద్ లోని కాల్పుర్ రైల్వే స్టేషన్ వరకూ మోదీ ప్రయాణించారు. ఈ సమయంలో మోదీ రైల్వే సిబ్బంది, వారి కుటుంబాలు, మహిళా వ్యాపారవేత్తలతో మాట్లాడుతూ ప్రయాణించారు. గాంధీ నగర్, ముంబయి సెంట్రల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు నడవనుంది.

 

ఈ రైలు ఉత్తమ సౌకర్యాలను అందిస్తుందని అధికారులు వివరించారు. అత్యాధేనిక ఫీచర్లతో వుందని, స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశామన్నారు. రైలు ఢీకొనకుండా వుండేందుకు కవచ్ టెక్నాలజీ కూడా అందులో వుందన్నారు. రైలు మొత్తం రిక్లైనింగ్ సీట్లు వున్నాయని, అయితే.. ఎగ్జిక్యూటివ్ కోచ్ లో 180 డిగ్రీలు తిరిగే సీట్ల అదనపు ఫీచర్ వుందన్నారు. ప్రతి కోచ్ లో ప్రయాణికులకు సమాచారం నిమిత్తం 32 అంగుళాల స్క్రీన్స్ వున్నాయని, దివ్యాంగులకు అనుకూలమైన వాష్ రూమ్ లు కూడా వున్నాయన్నారు.

Related Posts

Latest News Updates