ఆది సాయికుమార్ ‘సీఎస్ఐ సనాతన్’ గ్లింప్స్

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా
“సీఎస్ఐ సనాతన్”. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ)
ఆఫీస‌ర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్ష‌కుల ముందుకు
రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో  గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా
రూపొందుతున్న “సీఎస్ఐ సనాతన్” సినిమా గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు.
ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. హత్య కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ మూడ్ లో కనిపించారు. క్రైమ్ సీన్ లో దొరికిన ప్రతి చిన్న అంశాన్నీ రిపోర్టులో చేరుస్తూ  నివేదిక తయారు చేస్తున్నారు. ఎలాంటి నేరాన్నయినా చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయికుమార్ పాత్ర రూపొందింది. ఈ క్లూస్ తో నేరస్థులను  హీరో ఎలా పట్టుకోబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. ఇప్పటిదాకా రాని సరికొత్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. హత్య కేసు విచారణ సాగే క్రమం అంతా ఆద్యంతం ఆసక్తిని పంచనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా నవంబర్ రెండో వారం లో ప్రేక్షకుల ముందుకు రానుంది. న‌టీ న‌టులు – ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్,తాక‌ర్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్,  వసంతి తదితరులు సాంకేతిక వ‌ర్గం – , సినిమాటోగ్ర‌ఫీ ః జిశేఖ‌ర్, మ్యూజిక్: అనీష్ సోలోమాన్, పిఆర్ఒ ః జియ‌స్ కె మీడియా, నిర్మాత ః అజ‌య్ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడు ః శివ‌శంక‌ర్ దేవ్

Related Posts

Latest News Updates