మరో 10 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసేసిన కేంద్రం

తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం మరో సారి కొరడా ఝుళిపించింది. విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసారాలు చేస్తున్న 10 ఛానళ్లపై కొరడా ఝుళిపించింది. మత విద్వేషాలను వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో తప్పుడు కంటెంట్ ప్రసారం చేస్తున్న 45 యూట్యూబ్ వీడియోలను కూడా కేంద్రం బ్లాక్ చేసింది. కశ్మీర్, అగ్నిపథ్ లాంటి విషయాల్లో తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని కేంద్ర ప్రసారశాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ కేంద్రం ఇలాగే చేసింది. దేశ భద్రత విషయంలో తప్పుడు వార్తలు, ఊహాగానాలు ప్రసారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కొరడా ఝుళిపించింది.

 

Related Posts

Latest News Updates