హైదరాబాద్ నగరంలో నేడు భారీ వర్షం కురిసింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, కోఠి, మాసబ్ ట్యాంక్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మణికొండతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే వారు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మరోవైపు భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాత్రి 9 గంటల వరకూ ఇలాగే ట్రాఫిక్ వుంటుందని, నగర వాసులు బయటికి రాకుండా జాగ్రత్తగా వుండాలని సిటీ పోలీసులు పేర్కొన్నారు.