ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఎన్నారైలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే వైసీపీ పాలకులు తెలుగు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎన్నారై యూఎస్ నేత భాను మాగులూరి హెచ్చరించారు. గుంటూరు మిర్చి మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, సీతారామారావు, పురుషోత్తమరావు, బసవరావు, సిద్ధార్ధ్, నాగశంకర్, వినీల్ పాల్గొన్నారు.