9 రాష్ట్రాలను అత్యంత సీరియస్ గా తీసుకోండి… జేపీ నడ్డా ఆదేశం

రాబోయే 9 రాష్ట్రాల ఎన్నికలను అత్యంత సీరియస్ గా తీసుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. తెలంగాణ సహా… ఈ యేడాది జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని, దీని ద్వారా సార్వత్రిక ఎన్నికల విజయంపై దృష్టి నిలపాలని నడ్డా సూచించారు. ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో మొదటి రోజులో భాగంగా జేపీ నడ్డా అధ్యక్షుడి హోదాలో కీలక ప్రసంగం చేశారు. 9 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఏ ఒక్క చోట కూడా బీజేపీ ఓటమి చెందకుండా వ్యూహరచన చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్రనేత రవి శంకర్ ప్రసాద్ మీడియాకి వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందిందని నడ్డా చెప్పారని పేర్కొన్నారు. మోడీ హయాంలో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. మొబైల్​ఫోన్ల తయారీలో భారత్ రెండో స్థానంలో, ఆటోమొబైల్​రంగంలో మూడో అతి పెద్ద తయారీదారుగా ఉందని నడ్డా పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. 2023 చాలా ముఖ్యమైనదని బీజేపీ అధ్యక్షుడు అన్నారు. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో పోరాడి గెలవాలి, ఆపై 2024లో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలి’ అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

2023 చాలా ముఖ్యమైందని నడ్డా పేర్కొన్నారు. పార్టీ బలహీనంగా వున్న బూత్ లను బలోపేతం చేయాలని ప్రధాని సూచించారని, అలాంటి 72 వేల బూత్ లను గుర్తించామని పేర్కొన్నారు. ఇక… ఈ కార్యవర్గంలో జేపీ నడ్డా ఇటీవలే ముగిసిన ఎన్నికలపై కూడా చర్చించారని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. హిమాచల్ లో ప్రభుత్వాలను మార్చే సంప్రదాయాన్ని మార్చాలని ఎంతో ప్రయత్నించామని, అయితే.. అలా చేయలేకపోయామని జేపీ నడ్డా ఈ వేదికగా ప్రకటించారు.

 

Related Posts

Latest News Updates