68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ ప్రదానోత్సవం

68వ జాతీయ సినిమా అవార్డుల  ప్రదానోత్సవం దేశ రాజధాని ఢిల్లీలో వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  చేతుల మీదుగా నటీనటులు అవార్డులను అందుకున్నారు. 68వ జాతీయ సినిమా అవార్డుల  ప్రదానోత్సవం దేశ రాజధాని ఢిల్లీలో వైభవంగా జరిగింది. 2020 సంవత్సరానికి ఉత్తమ చిత్రాలను ఇటీవల ఎంపిక చేయగా.. నేడు అవార్డులను ప్రదానం చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  చేతుల మీదుగా నటీనటులు అవార్డులను అందుకున్నారు. ఢిల్లీలోని విఘ్నయన్ భవన్‌లో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘సూరయైపొట్రు’ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) మూవీ నిలిచింది. ఈ మూవీలో హీరోగా నటించిన సూర్య  ఉత్తమ హీరోగా.. అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఈ వేడుకకు హీరో సూర్య తన భార్య జ్యోతికతో కలిసి హాజరయ్యారు. సూర్య అవార్డు అందుకునే సమయంలో జ్యోతిక ఫొటో తీయడం.. జ్యోతిక అవార్డు అందుకునే సమయంలో సూర్య ఫొటోలు తీయడం అందరినీ ఆకట్టుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫోటో మూవీ నిలిచింది. సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ.. ప్రేమకు వర్ణంతో సబంధం లేదని నిరూపిస్తూ తీసిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఈ అవార్డును డైరెక్టర్ సందీప్ రాజ్ అందుకున్నారు. మరో తెలుగు సినిమా ‘నాట్యం’ బెస్ట్ మేకప్, బెస్ట్ కొరియోగ్రఫీ విభాగాల్లో పురస్కారాలను గెలుచుకుంది. ‘అల వైకుంఠపురములో’ సినిమాకు మ్యూజిక్ అందించిన థమన్.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. తానాజీ మూవీలో యాక్టింగ్‌కు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్  జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన ఈ అవార్డు రావడం మూడోసారి కావడం విశేషం. ఈ చిత్రం బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా నేషనల్ అవార్డుతో పాటు బెస్ట్ కాస్టూమ్ డిజైనర్ విభాగంలో అవార్డులు కైవసం చేసుకుంది.
68వ జాతీయ సినిమా అవార్డుల వివరాలు ఇలా..
ఉత్తమ నటుడు: సూర్య, అజయ్ దేవగణ్
ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి
ఉత్తమ దర్శకుడు: కె. ఆర్. సచ్చిదానందన్ (అయ్యప్పమ్ కోషియమ్)
ఉత్తమ సహాయనటుడు: బిజుమీనన్ (అయ్యప్పమ్ కోషియమ్)
ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివ రంజినీయుము ఇన్నుమ్‌ సిలా పెంగలుమ్‌)
ఉత్తమ బాల నటుడు: వరున్‌ బుద్దదేవ్‌(తులసీదాస్ జూనియర్‌)- స్పెషల్‌ మెన్షన్‌
ఉత్తమ సంగీత దర్శకుడు: తమన్‌ (అల వైకుంఠపురములో)
ఉత్తమ నేపథ్యం సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
బెస్ట్ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నచికేట్‌ బర్వే, మహేష్‌ షేర్లా(తానాజీ)
బెస్ట్ లిరిక్‌: సైనా (మనోజ్‌ మౌతషిర్‌)
మోస్ట్‌ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌: మధ్యప్రదేశ్‌
బెస్ట్‌ స్టంట్స్‌: అయ్యప్పనుమ్‌ కోషియమ్‌
బెస్ట్‌ కొరియోగ్రఫీ: నాట్యం (తెలుగు)
ఉత్తమ డ్యాన్సర్‌: సంధ్య రాజు (నాట్యం-తెలుగు)
నాన్‌ ఫియేచర్‌ ఫిలింస్‌..
బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: శోభా రాప్సోడీ ఆఫ్‌ రెయిన్స్‌-మాన్‌సూన్స్‌ ఆఫ్‌ కేరళ (ఇంగ్లీష్‌)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: విశాల్‌ భరద్వాజ్‌ (1232 కి.మీ: మరేంగే తో వహీన్‌ జాకర్‌) (హిందీ)
బెస్ట్‌ ఎడిటింగ్‌: అనాదీ అతలే (బార్డర్‌ ల్యాండ్స్‌)
బెస్ట్‌ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌- సందీప్‌ భాటి, ప్రదీప్‌ లెహ్వార్‌ (జాదూయ్‌ జంగల్‌) (హిందీ)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ (ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): అజిత్‌ సింగ్‌ రాథోడ్‌ (పర్ల్‌ ఆఫ్‌ ద డిసర్ట్‌ ) (రాజస్థానీ)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: నిఖిల్‌ ఎస్‌ ప్రవీణ్‌ (శబ్దికున్‌ కలప్ప) (మలయాళం)
ఉత్తమ డైరెక్షన్‌: ఆర్‌వీ రమణి (ఓ దట్స్‌ భాను- ఇంగ్లీష్‌, తమిళ్‌, మలయాళం, హిందీ)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్‌ (మరాఠి)
ఉత్తమ షార్ట్‌ ఫిక్షన్‌ ఫిలిం: కచీచినుతు (అస్సాం)
స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌: అడ్మిటెడ్‌ (హిందీ, ఇంగ్లీష్‌)
బెస్ట్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఫిలిం: ద సేవియర్‌: బ్రిగేడియర్‌ ప్రీతమ్‌ సింగ్‌ (పంజాబీ)
బెస్ట్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఫిలిం: వీలింగ్‌ ద బాల్‌ (ఇంగ్లీష్‌, హిందీ)
బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఫిలిం: డ్రీమింగ్‌ ఆఫ్‌ వర్డ్స్‌ (మలయాళం )
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌: జస్టిస్‌ డిలేయ్‌డ్‌ బట్‌ డెలివర్‌డ్‌ (హిందీ), 3 సిస్టర్స్‌ (బెంగాలీ)
బెస్ట్‌ ఎన్వైర్‌మెంట్‌ ఫిలిం: మాన అరు మానుహ్‌ (అస్సామీస్‌)
బెస్ట్‌ ప్రొమోషనల్‌ ఫిలిం: సర్‌మొంటింగ్‌ చాలెంజెస్‌ (ఇంగ్లిష్‌)

Related Posts

Latest News Updates